గురువులు సరస్వతి స్వరూపం అంటారు. లోకానికి పరిచయం చేసేది తల్లిదండ్రులు అయితే.. విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే.. ఆ గురువులు చెప్పే ప్రతిమాట జీవిత సత్యంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులకే ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి స్థానంలో వున్న ఓ గురువు కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియని విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. హయత్ నగర్ లో గౌతమి గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఘటన మరువక ముందే ఇలాంటి మరో ఘటన వెలుగుచూసింది.
Read also: UK PM Race: రిషి సునక్ కు షాక్.. లిజ్ ట్రస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువన్న సర్వే
మహేశ్వరం ప్రభుత్వ గర్ల్స్ జిల్లా పరిషత్ పాఠశాలలో 7 వతరగతి విద్యార్దినిలతో గత వారం రోజులుగా ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు వనపర్తి శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించడం సంచలనంగా మారింది. విద్యార్థినులపై చేయి వేసి, అసభ్యకరంగా మాట్లాడటం వారికి ప్రవేట్ పార్ట్స్ పై చేయడం ఇలా వారం రోజులుగా చేస్తుండటంతో.. విసిగి పోయిన విద్యార్థినులు తల్లిదండ్రులకు ఈవిషయాన్ని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేయండంతో ఈ కథకాస్త వెలుగులోకి వచ్చింది. పోలీసులు విద్యార్థినిలతో మాట్లాడగా.. శ్రీనివాస్ ప్రవర్తనపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. తమకు ప్రైవట్ పార్ట్స్ పై తాగడం మెచ్యూరిటీ గురించి మాట్లాడటమే కాకుండా.. వారితో.. అసభ్యంగా ప్రవర్తించాడని పిర్యాద చేయడంతో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు వనపర్తి శ్రీనివాస్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుని పై 354, 354 (D) IPC, Pocso ACT , Scst ACT కింద కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ 22న నగరంలోని హయత్ నగర్ లో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కాలేజీ ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు మాసాల క్రితం విద్యార్ధినికి మాయ మాటలు చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యనారాయణను పోలీసులు కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.