మంత్రి పువ్వాడ అజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

0
623

ఖమ్మం నియోజకవర్గం సన్నాహాక సభ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో కొద్ది మంది పనికిమాలిన బ్యాచ్ ఉందన్నారు. వాళ్లకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ తెలవదు.. బీజేపీ వాళ్లకు ఒక అబద్ధాల గ్రూప్ ఉందని, అజయ్ అన్న కూకట్‌పల్లి పోతుండు అని కొత్త ప్రచారం మొదలు పెట్టారన్నారు. కొంతమంది కూకట్‌పల్లి పోతడు అంటున్నారు.. అజయ్ అన్న కూకట్ పల్లి ఏం పీకటానికి పోతాడు… ఇక్కడి వాళ్ళని పీకటానికి అజయ్ అన్న ఉన్నాడు.. ఇంకా దంచాల్సిన వాళ్ళని దంచాకనే అజయ్ అన్న ఎటైనా పోతాడు.. అజయ్ అన్న సైన్యం చూసి ఎంత భయపడుతున్నారంటే.. అజయ్ అన్నను లోకల్ నుంచి పంపించి ప్రశాంతంగా ఉండాలని చేస్తున్నారు. పార్టీ ఐక్యంగా ఉంటే చూడలేకపోతున్నారు.

అజయ్ అన్న ఖమ్మం ను అభివృద్ధి చేసిండు.. పాత బస్టాండ్ తీసి కొత్త బస్టాండ్ పెట్టిండు.. మళ్ళీ పాత బస్ స్టాండ్ ను సిటీ బస్ స్టాండ్ గా మార్చిండు అని ఈర్ష పడుతున్నారు.. తాగడానికి నీళ్లు లేని ఖమ్మానికి గలగల నీళ్లు పారే విధంగా చేసిన.. అక్క చెల్లెళ్ల బుగ్గల మీద సొట్టలు ఉన్నాయి కానీ బిందెల మీద సొట్టలు లేని పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్‌. రెండుసార్లకు ఇవన్నీ చేస్తే మూడోసారి మనకు ముప్పతిప్పలే అని ఈ అబద్దపు నాయకులు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అవకాశాన్ని 33 జిల్లాల్లో మన ఖామ్మానికి కేసీఆర్‌ ఇచ్చారని, ఖమ్మం మీద గాని ఖమ్మం ప్రజల మీద గాని కేసీఆర్‌కి ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరే ఆలోచించండన్నారు. ఇలాంటి బంగారు అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలన్నారు. గొప్పగా మీరు వాట్సాప్ గ్రూప్ లలో ఫేస్‌బుక్‌ , ట్విట్టర్లు మీరు కూడా యాక్టివ్ ఉండాలన్నారు. ఖమ్మం సభను విజయవంతం చేయాలని పువ్వాడ అజయ్‌ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here