గురుకులంలో ఎలుకలతో విద్యార్ధుల సహవాసం

0
129

చక్కగా చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్ధుల అవస్థల పాలవుతున్నారు. సరైన వసతులు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రతిష్టాత్మకమయిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖమ్మం జిల్లా కారేపల్లి లోని గాంధీపురం వద్ద ఉన్న గురు కుల పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. గుట్ట మీద ఏర్పాటు అయిన గిరిజనసంక్షేమ శాఖకు చెందిన ఈ గురు కుల పాఠశాలలో అయిదుగురు విద్యార్ధులను ఎలుకలు కరిచాయి. గత రాత్రి నిద్ర పోయిన సందర్బంగా ఈ ఎలుకలుదాడి చేసినట్లుగా విద్యార్ధులు చెబుతున్నారు. అయితే అవి స్వల్పంగా కరవడంతో ట్రీట్ మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని విద్యార్థి సంఘ ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్ధి సంఘ ప్రతినిధులు ఆందోళనకు దిగారు.

అనేక అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతుంది ఐటీడీఏ గురుకుల పాఠశాల. దీంతో అవస్థలు పడుతున్నారు విద్యార్థులు. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రోడ్డెక్కారు విద్యార్ధులు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అవి విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయి. ఐదుగురు విద్యార్థుల ఎలకలు గాయపరిచిన సంఘటన ఆ పాఠశాల విద్యార్థులను కలవరపరిచింది. సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు ఏకంగా రోడ్డెక్కారు. సుమారు మూడు గంటలపాటు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. చివరికి పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.

ఈ సంఘటన గాంధీపురం లో జరిగింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీ పురం లో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురుకుల టి టి డబ్ల్యూ యూ ఆర్ జె సిని ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల అండ్ కాలేజీలో మొత్తం 470 మంది విద్యార్థులకు గాను 20 మంది బోధనా సిబ్బంది ఉన్నారు. మరో ఎనిమిది మంది వంట పని వారు పని చేస్తున్నారు. సరిపోను గదులు లేకపోవడంతో విద్యా బోధన జేసే గదిలోనే రాత్రివేళల్లో నిద్ర పోవాల్సి వస్తుంది. పాఠశాలలో మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం , మరుగుదొడ్లు సైతం అపరిశుభ్రంగా ఉండటం, ఫలితంగా దోమల బెడద తో జ్వరాల బారినపడటం పడటం సర్వసాధారణమైంది. అంతేగాక విద్యార్థులకు జ్వరం వచ్చినప్పుడు సరైన వైద్య సౌకర్యం అందించడంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజనాలు సైతం నాణ్యత సరిగ్గా భోజనం చేయటం లేదని విద్యార్థులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసౌకర్యాల మధ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠశాల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పాఠశాల అదనపు భవనం కోసం, మౌలిక సౌకర్యాల కోసం ప్రజలు ప్రపోజల్ పంపామని ప్రిన్సిపాల్ గమయ్య తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here