మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు ఎవడు ..!? అంటూ ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో మనస్పర్థలు ఉన్నాయి.. కానీ.. మర్రి శశిధర్ రెడ్డి కూల్ పర్సన్ అని చెప్పుకొచ్చారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళను బీజేపీ పక్కన పెట్టిందని, అలాంటివి అన్ని పార్టీల్లో సహజమే అన్నారు. సీనియర్ లను అవమానించే అంతటి శక్తి మాన్ ఎవరు లేరని పేర్కొన్నారు. కొన్ని అభిప్రాయాలు వస్తుంటాయి, పోతుంటాయని తెలిపారు. ఖమ్మంలో నన్ను ఎదుర్కునే మొనగాడు ఎవడంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. నాకు తెలుసు ఖమ్మం నీ ఎట్లా సెట్ చేసుకోవాలో అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి. మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో పరిణామాలు సహజం.. కొత్తేం కాదన్నారు. తొందరలోనే అన్ని సెట్ అవుతాయని ఆమె ఈసందర్భంగా తెలిపారు.
ఖమ్మం జిల్లాలో పేరుమోసిన నాయకులు, ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నా తన క్యాడర్ అలానే ఉన్నారని రేణుకా చౌదరి గర్వంగా చెప్పారు. అంతేకాదు.. వాళ్లందరికీ కత్తుల్లాంటి క్యారెక్టర్ అని, వంద కౌరవులు అక్కర్లేదని పంచపాండవులు ఐదుగురు చాలంటూ ఆమె క్యాడర్‌ని పాండవులతో పోల్చారు. అయితే.. బీజేపీకి ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ ఉండదని మతతత్వంతోనే రాజీకయం చేస్తారంటూ విమర్శించారు. బీజేపీకి హైదరాబాద్ పేరు మార్చడమే ఎజెండాగా వాళ్లు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. కాగా.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు తెలంగాణలో ఏమీ లేదని రాబోయేది హస్తమేనంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు.