తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం

0
124

మన ఊరు – మన బడి’ ఓ ప్రచారార్భాటం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మండి ప‌డ్డారు. ట్విట‌ర్ వేదిక‌గా తెలంగాణ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణరాష్ట్రంలో పేద పిల్లల చదువుకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని మండిప‌డ్డారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక వెలవెలబోతున్నాయని విమ‌ర్శించారు.

ఓ ప్ర‌చార అర్భాంటంగా ‘మన ఊరు – మన బడి’ త‌యారైంద‌ని మండిప‌డ్డారు. వీరిని ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం అని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రేవంత్ చేసిన ట్వీట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంస‌కంగా మారింది. ట్విట‌ర్ వేదిక‌గా రేవంత్ రెడ్డి విద్యాశాఖపై, రాష్ట్ర ప్ర‌భుత్వంపై వ్యంగ్యంగా ఆయ‌న చేసిన ట్వీట్ చ‌ర్చ‌కు దారితీస్తోంది.

పిల్లలకు చదువు లేదు ఉపాధ్యాయులకు జీతాలు లేవు ఇది భావి తరాలకు బంగారు బాట. పడకేసిన ప్రజా పాలన. తాగుడు ఉగుడుకు యువతను బానిస చేస్తున్న తెరాస ప్రజా పరిపాలన. బంగారు తెలంగాణ బానిస బతుకులు అంటూ.. కొంద‌రు ట్విట‌ర్ వేదిక‌గా మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here