కేసీఆర్‌.. జనం సమస్యలు ఎందుకు మాట్లాడలేదు : రేవంత్‌ రెడ్డి

0
134

మునుగోడు చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అయితే నిన్న మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ లపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి… కేసీఆర్‌కి లాభం చేకూర్చ్చినట్టు చెప్పారని, ఇద్దరి మధ్య లోపాయి కారి ఒప్పందం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్‌ కి ఓటేస్తే డిండి ప్రాజెక్ట్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలి. 8 ఏండ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఎందుకు పెండింగ్ లో పెట్టారు. దీనిపై ఎందుకు సమాధానం చెప్పలేదు కేసీఆర్‌. చర్ల గూడెం ముంపు బాధితులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ నీ అరెస్ట్ చేయించారు కానీ.. సమస్య కి పరిష్కారం చూపలేదు. నియోజక వర్గ సమస్యల ప్రస్తావన లేకుండా.. కేసీఆర్‌ తన చేత కానీ తనం బయట పెట్టుకున్నారు. మునుగోడులో డిగ్రీ..

జూనియర్ కాలేజీలు ఏమయ్యాయి..? బీజేపీ దాడుల మీద.. మోడీ మీద మాట్లాడిన కేసీఆర్‌… జనం సమస్య లు ఎందుకు మాట్లాడలేదు. కేసీఆర్‌ నీ మోడీ ఆదర్శంగా తీసుకుని పార్టీ ఫిరాయింపులు… చేస్తుంది. కేసులు పెట్టుడు.. ఇసుక అమ్ముకునుడు… వడ్లు కొనేది మీ వాళ్ళే. ఆఖరికి అంగన్ వాడికి పంపే గుడ్ల వ్యాపారం కూడా మీదే. నయీం డంప్ లో దొరికిన డబ్బులు దిగమింగింది నువ్వే. బీజేపీ.. కి ఉన్న ఏక లింగంని మూడు చేసింది కేసీఆర్‌. మూడు చోట్ల గెలిపించింది కేసీఆర్‌. మా సర్పంచ్..ఎంపీటీసీ లను బెదిరించి, లొంగ దిసుకున్నరు. బీజేపీ.. టీఆర్‌ఎస్‌ ఒకటే. మనిషి రక్తం మరిగిన పులి లెక్క.. బీజేపీ తెలంగాణ మీద పడింది. లేని ప్రత్యర్ధిని సృష్టించినది కేసీఆర్‌ కాదా..? దుర్మార్గాలకు రాచ గురువు కేసీఆర్‌ అంటూ రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here