బీజేపీ కాంగ్రెస్ లకు షాకేనా? టీఆర్ఎస్ హ్యాట్రిక్.. సర్వే ఏం చెబుతోంది?

0
853

తెలంగాణలో ఎన్నికల కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. ఈ సారి అధికారం మాదే అంటోంది. మోడీ కూడా అదే మాటన్నారు. కానీ తాజాగా ఓ సర్వే కమలదళానికి రుచించేలా లేదు. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ సర్వే ముందస్తు ఎన్నికల వేడిని మరింత పెంచేసిందని చెప్పాలి. ఒకవైపు వరదలతో బిజీగా వుంటే… ఆరా సంస్థ ఈ సర్వే ఫలితాలను హైదరాబాద్‌లో విడుదలచేసింది. ఈ సర్వే నివేదిక హాట్ టాపిక్ అవుతోంది. అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఈ సర్వే రిపోర్ట్‌పై అప్పుడే విమర్శలు, ప్రతి విమర్శలు సైతం మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్, ఈ సంవత్సరం మార్చి, జులైల్లో మూడు దఫాలుగా ఈ సర్వే నిర్వహించామని సంస్థ తెలిపింది.

మొత్తం 119 స్థానాల్లో సర్వే నిర్వహించామని పేర్కొంది. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను విడుదలచేసింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి అని సర్వే సంస్థ కుండబద్ధలు కొట్టింది. టీఆర్ఎస్ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్‌కు అత్యధికంగా 38.88 శాతం ఓట్లు పోల్ అవుతాయి. భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి ఎదుగుతుంది. 30.48 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుంది. గతంలో రెండో స్థానంలో వున్న కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితం కానుంది.

కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం ఓట్లు పడతాయి. ఇతర పార్టీలు 6.91 శాతం ఓట్లను సాధిస్తాయి. కరీంనగర్ కోటపై టీఆర్ఎస్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ హవా వీస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇక్కడ టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్‌‌లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధించగలవు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ కారు జోరు కొనసాగించడం ఖాయం అంటోంది.

ఈ జిల్లాల్లో టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్‌‌లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధిస్తాయంటోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కారు జోరు కొనసాగుతుంది. ఇక్కడ అత్యధికంగా 40.43 శాతం ఓట్లు రానున్నాయి. బీజేపీ- 35.32, కాంగ్రెస్- 16.33, ఇతరులకు 7.92 శాతం ఓట్లు పడతాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండల్లో టీఆర్ఎస్ దే మళ్లీ గులాబీ గుబాళింపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here