Flood in Hyderabad: జలమయమైన హాస్టల్స్.. సాయం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు

0
28

తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు చాల ప్రాంతాలు వరద ముప్పుతో బిక్కుబిక్కు మంటున్నాయి..ఎప్పుడు ఎం జరుగుతుందా అన్నట్టు ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.. తాజాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పదుల సంఖ్యలో హాస్టల్స్ వరద నీటిలో చిక్కుకున్నాయి.. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసింది.. వివరాలలోకి వెళ్తే..

మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ లో సుమారు 15 హాస్టల్స్ లోకి వరద నీరు చేరడంతో నీట మునిగాయి.. దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. అక్కడే ఉన్న మరో ౩౦ అపార్ట్‌మెంట్‌లు వర్షం కారణంగా ముంపునకు గురయ్యాయి.. ఈ అపార్టుమెట్ లలో ఇంజనీరింగ్ విద్యార్థులు నివాసం ఉంటున్నారు.. మొదటి అంతస్థు వరకు వరద నీరు చేరడంతో విద్యార్థులు బయటకి రాలేని పరిస్థితి నెలకొంది.. దీంతో ఈ అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులు ఉదయం నుంచి భయంతో గడుపుతున్నారు.. దీనితో విద్యార్థులు పోలీసులకి సమాచారం ఇచ్చారు..

వెంటనే ఈ విషయంపైన స్పందిచిన పోలీసులు రెండు జేసీబీలను పిలిపించి అపార్ట్‌మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు.. కాగా మైసమ్మగూడలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.. చెరువు సమీపంలో అపార్టుమెట్స్ నిర్మించడంతో ఈ విపత్తు సంభవించింది.. అలాంటి ప్రాంతాలలో భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇచింది? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేస్తారు ఆ తరువాత అంత మామూలే అనే విమర్శలు గుపిస్తున్నారు.. నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణం చేసిన బిల్డర్స్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు పేర్కొన్నారు.. కాగా తెలంగాణలో ౩ రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి.. ఇంకా మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here