రోజురోజుకీ విద్యారంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ అవకాశాల గురించి విద్యార్దులు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ అవకాశాలపై వెబినార్ నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్ – విశాఖపట్టణంబు సంయుక్తంగా ‘ఆర్కిటెక్చర్లో విజయవంత మైన కెరీర్” అనే అంశంపై జనవరి 21, 2023న (శనివారం) మధ్యాహ్నం 2.30 నుంచి 4.00 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు.
తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గ్లాస్గో (స్కాట్లాండ్)లోని స్టాత్అక్లెడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి సీహెచ్ పట్టభద్రురాలు, విద్యావేత్త, ప్రముఖ రూపశిల్పి కృష్ణకోని దత్తా ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు జూమ్ లింక్ http://surl ticshit ద్వారా ఈ నెబినార్లో పాల్గొనవచ్చని, ఇతర వివరాలు, కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రాయ్ sroy2 pilam eduకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.