మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

0
144

ఇంట్లో ఇల్లాలున్నా, పచ్చని సంసారం కొనసాగుతున్నా.. కొందరు మగాళ్లు అడ్డదారులు తొక్కుతుంటారు. కామకోరికలు తీర్చుకోవడం కోసం, ఇతర మహిళలపై మోజు పెంచుకుంటుంటారు. పలితంగా.. వారి కాపురాలు కూలిపోతాయి. కుటుంబ పరువు బజారున పడుతుంది. ఇలాంటి వ్యవహారమే వరంగల్‌లో చోటు చేసుకుంది. పరాయి మహిళపై మోజుతో.. నిత్యం భార్యని వేధించే ఓ ప్రబుద్ధుడు, చివరికి తాను చేసిన నీచ పనికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో అడ్డంగా బుక్కై, కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

వరంగల్ నగరంలోని పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించిన జీవన్ కుమార్ అనే వ్యక్తి, కొంతకాలం క్రితం సస్పెండ్ అయ్యాడు. ఇతనికి నాలుగేళ్ల క్రితమే కుమార్ పల్లికి చెందిన చందనతో వివాహం అయ్యింది. అయితే.. పెళ్లికి ముందే ఇతనికి తాను పని చేసిన కార్పొరేషన్‌లోనే రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న ప్రతిభ అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. అందుకే.. పెళ్లైన మొదట్నుంచే అతడు తన భార్యన వేధిస్తూ వచ్చాడు. ఏనాడూ ఆమె పట్ల సరిగ్గా ప్రవర్తించింది లేదు. ఎంతైనా కట్టుకున్న భర్తే కదా.. ఏదో ఒక రోజు మార్పు వస్తుందిలే అనుకొని, చందన అతని చిత్రహింసల్ని భరిస్తూ వచ్చింది. అయితే.. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా జీవన్ కుమార్‌లో మార్పు రాలేదు.

తన భార్య చందనని జీవన్ మరింత వేధించసాగాడు. అంతేకాదు.. ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. అతని ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చేశాయి. దీంతో.. భర్తపై చందనకు అనుమానం వచ్చింది. కచ్ఛితంగా తన మరొకరితో అక్రమ సంబంధం ఉందని అనుమానించింది. ఆ అనుమానం నిజం అయ్యింది. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌తో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని తేలింది. దీంతో తన భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తన బంధువుల్ని పిలిపించి.. ప్రతిభతో జీవన్ కుమార్ ఉన్న సమయంలో అడ్డంగా పట్టుకొని, బంధువుల చేత దేహశుద్ది చేయించింది. అనంతరం ఆ ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here