Teachers for Justice: టీచర్ల బదిలీల్లో పైరవీ జరగాయంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. తెర చాటు బదిలీలతో రంగారెడ్డి, మెడ్చల్ జిల్లాలకు టీచర్లు భారీగా చేరుకున్నారు. ఈ బదిలీలపై ఉపాద్యాయులు అభ్యంతరం చెబుతున్నారు. రాజకీయ నేతల ఒత్తిడిలతో షెడ్యూల్ కన్నా ముందే బదిలీలు జరిపారంటూ ఆరోపించారు. ఉపాధ్యాయ పోరాట సంఘాల సమితి ఆందోళనలకు పిలుపు ఇవ్వడంతో.. భారీగా చేరుకున్నామని.. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పలుకుబడితో చేస్తున్న వందలాది పైరవీ బదిలీలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ విధమైన అక్రమాలకు తావులేకుండా బదిలీలు పారదర్శకంగా జరపాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సూచించిన ప్రభుత్వమే పైరవీ బదిలీలకు తెరలేపడం ఉపాధ్యాయుల్లో అశాంతికి కారణమౌతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చిన విధంగా పైరవీ బదిలీలు నిలివేసి, ఉపాధ్యాయులు అందరికీ బదిలీల్లో పాల్గొనే అవకాశం ఇచ్చి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. మరిదీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.