వెస్టిండీస్‌తో సిరీస్ కోసం భారత జట్టు కరీబియన్ దీవిలో అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, టీ20 లకు హార్దిక్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఈ సిరీస్‌కు ముందు, టీమిండియా ఆటగాళ్లు సరదాగా కరేబియన్ దీవిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయితే.. ఈ వీడియోను ఇషాన్ కిషన్ షూట్ చేశాడు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ అనే కిరాణ దుకాణంలో కాస్ట్ లీ మెటీరియల్ చేరింది..
ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లు బీచ్ లో వాలీబాల్ ఆడుతూ కనిపించారు. వాలీబాల్ మ్యాచ్ కోసం టీమిండియాను 2 టీమ్స్ గా విభజించారు. ఒక జట్టులో విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ సహా సీనియర్ ప్లేయర్స్ ఉండగా.. మరొక జట్టులో మహమ్మద్ సిరాజ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సహా ఇంపార్టెంట్ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా ఆటగాళ్లకు మరో 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయనున్నారు.
Read Also: Hijab: ఆపరేషన్ థియేటర్లలో హిబాబ్..? అనుమతి కోరిన మెడికల్ స్టూడెంట్స్..
జులై 12 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జులై 6న స్థానిక జట్టుతో భారత జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. దీని ద్వారా కరేబియన్ దీవుల పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళిక రచించారు.
Read Also: Rath Yatra: రథయాత్రలో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
టీమిండియా టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ, జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, ఆర్. అశ్విన్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.