ముగిసిన కేబినెట్‌ సమావేశం.. 10 లక్షల కొత్త పించన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

0
1294

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అయితే సుమార 5 గంటల పాలు ఈ సమావేశంలో జరిగింది. అయితే.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్‌. మొత్తంగా కొత్తవి,. పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు కానున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు.. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్టీ టవర్‌ నిర్మించాలని నిర్ణయం.. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు…. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కేబినెట్‌ నిర్ణయం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, మరియు స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు. ఈ నెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయం. జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశం.

గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న నిర్ణయం జరిగింది. వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం. తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం. షాబాద్ లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో స్థలాల కేటాయింపునకు 45 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్లో సమగ్రమైన చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర యొక్క ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, కేంద్రం ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్ -12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో S.N.A. అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. అంతేకాక ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడం మరియు పరిమితుల్లో కూడా కోతలు విధించడం జరిగింది. ఎప్.ఆర్.బి.ఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్రం యొక్క ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేది. సీ.ఎస్.ఎస్.లో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి 47,312 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ వివరించింది. అయితే, గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క రైతుబంధు పథకం కింద రైతులకు 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందని ఆర్థికశాఖ అధికారులు క్యాబినెట్ కు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం 1 లక్ష 84 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అందులో సీఎస్ఎస్ పథకాల కింద అందింది రూ.5200 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రాష్ట్రం పెట్టిన ఖర్చులో 3శాతం కంటే తక్కువ మాత్రమే కేంద్ర పథకాల కింద నిధులు అందాయి. కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతుందని, రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, రాష్ట్ర జీఎస్డీపీ మరో 3 లక్షల కోట్లు పెరిగి, 14.50 లక్షల కోట్లకు చేరుకునేదని సీఎం కేసిఆర్ అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినప్పటికీ, దేశ ఆదాయానికి 5 శాతం మనం కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని అధికారులు కేబినెట్ కు వివరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here