రేపు ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్‌ సర్వే

0
132

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈనేపథ్యంలో. సీఎం కేసీఆర్‌ రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే కడెం నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో.. సీఎం కేసీఆర్‌ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పాల్గొననున్నారు. రేపు జరిగే ఏరియల్‌ సర్వేలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను సీఎం నేరుగా పర్యవేక్షించనున్నారు.

దీంతో సీఎం కేసీఆర్‌ సర్వేకు ఎటువంటి ఆటంకం కాకుండా అధికారులు పకడ్బంది ఏర్పాట్లను చేపట్టింది. ఈ సర్వేకి సంబంధించిన హెలికాప్టర్‌ రూట్‌ ను ఫైనల్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈనేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా.. అధికారులు దృష్టి సారించారు. గోదావరి ముంపు ప్రాంతాల్లోని ఆసుపత్రి వైద్యులు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here