యావత్తు ప్రపంచ దేశాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా రక్కసి మరోసారి పంజా విసురుతోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,663 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో.. 984 మందికి కరోనా సోకినట్లు నిర్థారణైంది. అయితే.. హైదరాబాదులో అత్యధికంగా 365 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61, రంగారెడ్డి జిల్లాలో 57, నల్గొండ జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి.
వీటితో పాటు.. ఇంకా 687 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 923 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,24,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,14,179 మంది కరోన నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,418 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు