తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు

0
1213

కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,031 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 605 మందికి కరోనా సోకినట్లు నిర్థారణైంది. అయితే అత్యధికంగా హైదరాబాదులో 231 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 42, రంగారెడ్డి జిల్లాలో 38, కరీంనగర్ జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 992 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,27,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,18,552 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 4,720 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ లో మరో కొత్త సబ్‌ వేరియంట్‌ను గుర్తించారు వైద్యులు. ఈ వేరియంట్ వ్యాధినిరోధక శక్తిని తప్పించుకొని మరీ మానవ శరీరంపై ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే వందల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here