తర్జన భర్జన.. చివరకు వాయిదా

0
178

ఓవైపు వర్షాలు దంచికొడుతున్నాయి.. మరోవైపు పరీక్ష సమయం ముందుచుకోస్తోంది.. ఎంసెంట్‌ ఉంటుందా? ఉండదా..? రద్దు చేస్తారా? కొనసాగిస్తారా? ఇలాంటి ఎన్నో అనుమానాలు.. అయితే, దీనిపై ఉన్నత విద్యామండలి ఉదయం ఓ మాట.. మధ్యాహ్నం మరో మాట మాట్లాడింది.. ఇవాళ పాలిసెట్‌ ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా షెడ్యూల్‌ ప్రకారమే ఎంసెట్‌ ఉంటుందని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.. కానీ, ఆ తర్వాత కొంత సమయానికే ఎంసెట్‌ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. మొత్తంగా ఎంసెట్‌ వాయిదాపై క్లారిటీ వచ్చింది..

మూడు రోజుల పాటు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు అంచనా వేయడంతో.. ఈ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో వుంచుకొని సంబంధిత అధికారులతో సమీక్షించి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈ నెల 14 మరియు 15వ తేదీల్లో జరగాల్సిన TS EAMCET (AM)-2022 (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షను మాత్రేమే వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగిందని ఓ ప్రకటనలో పేర్కొంది ఉన్నత విద్యామండలి.. మరియు ఈ పరీక్షను నిర్వహించే తదుపరి తేదీల వివరాలను త్వరలోనే తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.. అయితే, ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం TS EAMCET- 2022 నిర్వహణ ముందుగా నోటిఫై చేయబడిన షెడ్యూల్ ప్రకారం, అనగా 18 జులై నుండి 20 జులై 2022 వరకు జరిగే పరీక్షలు, యథావిథిగా నిర్వహించబడుతాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.ఆర్. లింబాద్రి పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here