కేంద్ర ప్రభుత్వం పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోంది

0
165

రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కర్నాటకలో ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు?. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీలకు ఎలా తెలుసు? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వలను పడగొట్టి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కేంద్రం పరిపాలన మర్చిపోయిందని అన్నారు. సీబీఐ నోటీసులు ఇస్తుంది అని బీజేపీ ఎంపీ అంటుంది. మీరు పార్టీనా? దర్యాప్తు ఏజెన్సీ నా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు డైరెక్షన్ చేస్తున్నారు.. లేక సీబీఐ లీకు ఇచ్చి అయిన ఉండాలని, జేబు సంస్థలుగా మరాయా అనే అనుమానం కలుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో మత కలహాలు మంచివా? అంటూ ప్రశ్నించారు. భూమికి బరువైన పంట రాష్ట్రంలో పండుతుందని, బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడు భూముల్లో నీళ్లు పారియ్యాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంట్రాక్టు పనులకు 40 శాతం కమిషన్ ఇవ్వాలని కర్నాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటున్నారు. ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవని మంత్రి హరీశ్‌ రావ్‌ అన్నారు. కవిత ఇంటిపై దాడి ఎందుకు చేయాలని మండిపడ్డారు. కవిత ఇంటి దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ఇదిబీజేపీ కుట్ర అని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here