తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేవారు. తనఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నానే అనుమానం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొదట తుషార్ పేరు ప్రస్తావించారని అనంతరం రాజ్‌భవన్ పేరు కూడా ప్రస్తావించారని గవర్నర్ తెలిపారు. అయితే తుషార్ గతంలో రాజ్‌భవన్‌లో తన ఏడీసీగా పనిచేశారన్న తమిళసై అంత మాత్రానికే రాజ్‌భవన్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోకి లాగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాది ప్రగతిభవన్ కాదు అంటూ మండిపడ్డారు. చాలా రోజుల నుంచి ప్రభుత్వానికి రాజ్‌భవన్‌కు మధ్యదూరం పెరుగుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు అదికాస్తా ముదిరినట్లు ఆమె మాట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివాదంపై బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని, వాటిని పరిశీలిస్తున్నానని ఆమె చెప్పారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే తాను సమయం తీసుకున్నానని, ఆ బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఖాళీల విషయమై సమగ్ర నివేదికను తాను ప్రభుత్వానికి ఇచ్చానని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని తాను ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తున్నానని.. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టతనిచ్చారు.