రేపు తెలంగాణ గవర్నర్‌ తమిళసై భద్రాచలం పర్యటన

0
161

తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో ఎడతెలిరి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ప్రాజెక్టు, చెరువులు నిండిపోయాయి. భారీ వానలకు మరోవైపు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. రికార్డ్‌ స్థాయిలో నీరు భద్రాచలం వద్ద చేరుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. రికార్డ్‌ స్థాయిలో నీరు భద్రాచలం వద్ద చేరుతున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ గవర్నర్‌ తమిళసై రేపు భద్రాచలంలో పర్యటించనున్నారు. గోదావరి వరద నీటితో ముంపుకు గురైన ప్రాంతాల్లో గవర్నర్‌ పర్యటించనున్నారు. ఈరోజు రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుని అక్కడ నుంచి రైలులో భద్రాచలం వరకూ ప్రయాణించనున్నారు గవర్నర్‌.

అయితే మరోవైపు భద్రాచలంకు వరద ముప్పు పొంచి ఉండటంతో.. రికార్డు స్థియికి చేరుకుంటున్న వరద నీటితో ఏక్షనం ఏమీ జరుగుతుందోనని స్థానికుల్లో ఆందోళన చెందుతున్నారు. భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని గోదారమ్మ, శాంతించాలని భద్రాచలం గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదారమ్మకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హారతులు అందించారు. ఈకార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని , జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఐటీడీఏ పీవో గౌతం, భద్రాద్రి ఆలయ ఈవో శివాజీ, అధికారులు, వేద పండితులు, అర్చకులు. పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here