ఆ వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టు ఆదేశాలు..

0
186

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలిపింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని వెల్లడించింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని కోర్టు స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అలాగే విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే దుర్గాపూజపై పశ్చిమ బెంగాల్ మార్గదర్శకాలను పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. కాగా, తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది.. ఊరు వాడ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి.. భక్తి శ్రద్ధలతో గనపయ్యను పూజిస్తారు భక్తులు.. ఇక, హైదరాబాద్‌లో జరిగే గణేష్‌ నిమజ్జనం, ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ఎంతో ప్రత్యేకంగా నిలిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here