ఈనెల 28న ప్ర‌మాణ స్వీకారం చేయనున్న తెలంగాణ హైకోర్టు నూతన సీజే

0
108

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూత‌న చీఫ్‌ సీజేగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్ నియ‌మితులైన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న ఈ నెల (జూన్) 28వ తేదీన‌ పరమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ‌ గవర్నర్ తమిళి సై రాజ్‌భవన్‌లో ఉజ్జల్‌ భుయాన్‌‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా.. నూతన సిజే ప్రమాణ స్వీకారానికి రావాలని రాజ్‌భవన్ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అయితే సీఎం కేసీఆర్ స‌మాధానం పై సీఎంవో మౌనంగా వ‌హిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మ‌రోసారి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వ‌నీయ స‌మాచారం. కాగా.. సీఎం కు రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మ‌ధ్య గ్యాప్ మరింత పెరిగే అవ‌కాశం క‌నిపించ‌నుంది.

అయితే..రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆయన్ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసిన విష‌యం తెలిసిందే. కాగా..ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బదిలీ చేయాలని నిర్ణయించ‌డంతో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేయ‌డం జ‌రిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఎన్వీ రమణ, తర్వాత.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచడం జ‌రిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here