మేం ఇచ్చినదానికంటే మీరు ఎక్కువిచ్చినట్లయితే రాజీనామా చేస్తా..

0
223

ఢిల్లీ వేదికగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని విరుచుకుపడ్డ ఆయన.. బీజేపీ భావ దారిద్యానికి నిదర్శం.. మేం చేయాలనుకుంటే చాలా చేస్తాం.. కానీ, చేయబోమన్నారు.. 8 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసింది? అని నిలదీసిన ఆయన.. ఇప్పటికీ గుజరాత్ లో కరెంట్ కష్టాలు ఉన్నాయి.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత ఊర్లో కరెంట్ లేని పరిస్థితి ఉందన్నారు.. పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారు.. కానీ, ఏమీ చేయలేరన్నారు.. ఇక, తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చిందా.. రాష్ట్రం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా.. కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన దానికంటే, వాళ్లు ఎక్కువ ఇచ్చినట్లు చూపెడితే.. నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్తానని ఓపెస్‌ చాలెంజ్‌ విసిరారు కేటీఆర్.

ఇక, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విపక్షాలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా కు మద్దతు తెలిపామని వెల్లడించారు కేటీఆర్.. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాం.. ఆయన్ను హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించామని తెలిపారు.. భారత్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహారిస్తోందని మండిపడ్డ ఆయన.. అడ్డు అదుపు లేకుండా పోయింది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 8కి పైగా రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అధికారాన్ని కైవసం చేసుకుంటారు.. గట్టిగా మాట్లాడితే ఏజెన్సీలను పురి గొల్పుతున్నారని ఎద్దేవా చేశారు.. ప్రజా స్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.. తిరగబడేది తెలంగాణ నుంచే రావొచ్చు అని హెచ్చరించారు. ఇక, బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని తిరస్కరిస్తున్నాం.. ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.న. యశ్వంత్ సిన్హా గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, భీష్ముడు మంచి వాడే.. కానీ, యుద్ధంలో కౌరవుల పక్షాన ఉన్నారని గుర్తుచేసిన ఆయన.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here