బండి సంజయ్‌కి పోలీసుల షాక్‌.. ఇచ్చినట్టే ఇచ్చి..!

0
123

బీజేపీ, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పోలీసులు షాక్‌ ఇచ్చారు.. అదనపు భద్రత కేటాయించినట్టే కేటాయించి మళ్లీ వెనక్కి తీసుకున్నారు.. అగ్నిపథ్ స్కీమ్‌పై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ పరిధిలో.. ఇటీవల బండి సంజయ్​భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రస్తుతం ఉన్న భద్రతతో పాటు అదనంగా (1+5) రోప్ పార్టీ, ఎస్కార్ట్ వాహనం కూడా ఇచ్చారు.. అయితే, ఈ నిర్ణయం తీసుకున్న రెండు రోజుల తర్వాత మళ్లీ వెనక్కి తీసుకున్నారు. దీంతో.. ఆయనకు పోలీసులు షాకిచ్చినట్టు అయ్యింది.. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

టీఆర్ఎస్‌ ప్రభుత్వ ఒత్తిడితోనే బండి సంజయ్​కి ఇచ్చిన అదనపు భద్రతను వెనక్కి తీసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు.. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరిగాయి.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసమే జరిగింది.. అయితే, అగ్నిపథ్​ పథకం, ఆందోళనలపై బండి సంజయ్​చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచిన పోలీసులు.. మళ్లీ వెనక్కి తీసుకున్నారు. టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మరో వివాదం రాజుకున్నట్టు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here