రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా చేయనున్నారు. కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులందరూ విధులను బహిష్కరించనున్నట్లు టీఎస్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేడు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలిగినా.. పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని హెచ్చరించింది. కానీ.. దానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈనేపథ్యంలో.. పవర్ ఇంజనిర్స్ అసోసియేషన్, విద్యుత్ JAC ప్రతినిధులు మహా ధర్నా పోస్టర్ ను కూడా ఆవిష్కరించిన విషయం తెలిసిందే.. విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడితే..? పూర్తీగా విధులను బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగేందుకు సిద్ధమని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
read also: <a href=”https://ntvtelugu.com/andhra-pradesh-news/major-road-accident-in-prakasam-district-211080.html”>Road Terror in Prakasam: కంభం సమీపంలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం</a>
అయితే.. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈబిల్లుతో అనేక సమస్యలు వస్తాయని, అసలు విద్యుత్ రంగాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరించేందుకు సిద్ధమవుతోందని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రైవేట్ సంస్థలకు రూపాయి ఖర్చు లేకుండా అదే విద్యుత్ లైన్ నుండి సరఫరా చేసేలా ఈ బిల్లు ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు కేంద్ర తీసుకొచ్చే కొత్త చట్టంతో వినియోగదారుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.
అయితే నిన్న (ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల నుంచే విధులు బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ కోడూరి ప్రకాశ్, కన్వీనర్ ఎన్.శివాజీ తెలిపారు. అయితే ఈ మహాధర్నాతో రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ సరఫరా తీవ్ర అంతరాయాలు ఏర్పడి చీకట్లు కమ్ముకునే ప్రమాదం వుందని పరిశ్రమలపై తీవ్ర ప్రభా వం పడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే చేస్తున్న ఈఉద్యమంలో విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకే కావున వినియోగదారులు తమకు సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి
<a href=”https://ntvtelugu.com/andhra-pradesh-news/next-2-days-heavy-rains-in-telugu-states-211073.html”>Weather Update: తీవ్ర అల్పపీడనం.. భారీవర్షాలకు అవకాశం</a>