రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గాంజా గ్యాంగ్.. కత్తులతో దాడి

0
130

హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్ హసన్ నగర్ లో శివారులో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. తాజాగా హసన్‌ నగర్‌ లో.. గాంజా గ్యాంగ్ హల్ చల్‌ సృష్టించింది. హలీమ్ అనే యువకుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసారు. సుమారు ఆరు మంది హలీమ్‌పై దాడి చేసినట్లు సమాచారం. గంజాయి మత్తులో యువకుడిపై దాడి చేసి చెరువులో పడేసి వెళ్లిపోయారు. యువకుడి అరుపులు కేకలు విని చెరువులో నుండి బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శరీరంలోని పలు చోట్ల కత్తి పోట్లు వుండటంతో వైద్యం చేసేందుకు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. అకారణంగా తన పై దాడి చేసారని, ప్రతి రోజు రాత్రి 10 గంటలు దాటింది అంటే చాలు కొంత మంది యువకులు గాంజా సేవించి మద్యం మత్తులో వచ్చిపోయేవారిని కత్తులతో దాడి చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని హసన్‌ నగర్‌ ప్రజలు. ఎన్ని సార్లు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. నన్ను చంపడానికి ఉస్మానియా ఆసుపత్రికి కూడా వచ్చారని బాధితుడు హలీమ్‌ తెలిపారు. 100 ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

2022 జనవరి 21న హైదారాబాద్ నగరంలో గంజాయి స్మగ్లర్స్ ముఠా పట్టుపడిన విషయం తెలిసిందే. సైదాబాద్ సంఘటన తర్వాత గంజాయి రవాణపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ప్రత్యేక నిఘాతో గంజాయి స్మగ్లింగ్‌‌ను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలకు చెంది మరో ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 1.80 కోట్ల విలువ చేసే 800 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లు ఒక ముఠాగా ఏర్పడి.. ఒడిశాలోని కొరపుట్ నుంచి మహారాష్ట్రలోని నాసిక్ కు అల్లం రవాణా మాటున నిందితులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిపెన్ రవీంద్ర మీడియా ద్వారా వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ఇంకా నగరంలో గంజా గ్యాంగ్‌ ముఠా ఆగడాలను అరికట్ట వేయలేకపోతున్నారు. మరి వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here