భార్య ఆత్మహత్య.. భర్తకు సత్తుపల్లి న్యాయస్థానం సంచళన తీర్పు

0
43

భార్య భర్తల సంబందాలు అనుమానాలు తప్పా అన్యోన్యత కరువుతుంది. కుటుంబంలో కలతలు, ఒకరిపై ఒకరు వాదోప వాదాలు తప్పా సంతోషాలు కనుమరుగవుతున్నాయి. కుటుంబంతో గడిపే రోజులు పోయాయి. ఆనందంగా గడపాల్సిన జీవితాల్లో అనుమానాలకు తావు లేపుతున్నాయి. అలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లాలో వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో సురేష్‌, సూజాత భార్య భర్తలిద్దరూ పెళ్లైన కొద్దిరోజులు సజావుగా సాగిన వారి కాపురంలో అనుమానాలు తావులేపాయి. భార్యపై భర్త అనుమానంతో రోజూ చిత్రహింసలకు గురిచేసేవాడు. అయినా భరిస్తూ భర్తతోనే తన జీవితం అనుకున్న భార్యను రాను రాను దారుణంగా చిత్రహింసలు మొదలు పెట్టాడు. ఆమెలో సహనం చచ్చిపోయింది. చివరకు సుజాత ఆత్మహత్య చేసుకుందామనుకుంది. తీవ్ర మనస్థాపనికి గురైన భార్య సుజాత 2018లో వృద్దాశ్రమంలో ఉరివేసుకొని సుజాత ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వలనే సుజాత మృతి చెందిదని మృతురాలి తల్లి‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈకేసు పై స్పందించిన సత్తుపల్లి న్యాయస్థానం.. భార్య సుజాత మృతికి కారణం అయిన భర్త సురేష్‌కి మూడేళ్ళ జైల్ శిక్ష ,10 వేల జరిమానా విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here