తెలంగాణాలో ౩ రోజులనుండి నిర్విరామంగా వర్షాలు కురుస్తున్నాయి.. మరో ౩ రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా సూచించింది.. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది.. వర్షాల తీవ్రత ఎక్కువ గా ఉన్న ప్రాంతాలలోను.. అలానే వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలలోను పాఠశాలలు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు ఉన్నత అధికారులు..
అలానే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడ సెలవలు ప్రకటిస్తూ ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు కలెక్టర్.. రాబోవు రెండు రోజుల్లో వర్ష తీవ్రతను బట్టి సెలవలు పొడిగిస్తారా లేదా అని తెలియ చేస్తాం అన్నారు.. పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని అయన సూచించారు.. వర్షాలకు బయటకి రానివద్దని ఆయన పేర్కొన్నారు..
మంగళవారం తెల్లవారు జాము నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ఉదయం పాఠశాలలు, కార్యాలయాలకు బయల్దేరిన వారి వాహనాలతో రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మూడురోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు..
మరికొద్ది గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేపథ్యంలో మంత్రి తలసాని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్‌కో ఎండీలతో మాట్లాడారు. రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.