అదను చూసి మాటువేసి దొంగతనం చేయడం దొంగలకు వెన్నతోపెట్టిన విద్య. ఊరికి వెళ్ళి వచ్చేలోగా ఇంటిని దోచేశారు దొంగలు. సంక్రాంతికి ఊరెళితే అదే అదునుగా చూసుకొని దుండగులు ఓ ఇంటిని లూటీ చేశారు ఇంట్లోకి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 10 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని ఇస్నాపూర్ తేజ కాలనీలో నివాసం ఉంటున్న గోపీచంద్ స్థానికంగా వ్యాపారం చేస్తూ నివాసం ఉంటున్నాడు.
సంక్రాంతి పండగ సందర్భంగా వారి స్వగ్రామం అయిన గుంటూరుకు వెళ్లడంతో అదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. పది లక్షల నగదు ,బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఊరు నుంచి వచ్చి చూసిన గోపీచంద్ ఇల్లంతా పరిశీలించగా సామాన్ల చిందరవందరగా పడి ఉండడంతో బీరువాను పరిశీలించగా అందులో నగదు, బంగారు నగలు కనపడకపోవడంతో ఆందోళన గురయ్యాడు. దీంతో గోపీచంద్ పటాన్ చెరు పోలీసు లను ఆశ్రయించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.