రూట్ మార్చిన పులి… పాదముద్రలు గుర్తించిన అధికారులు

0
1022

ఆదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరించడం కలకలం రేపుతోంది..మొన్నామద్య రోడ్డుపై నాలుగు పులులు కనిపించగా తాజాగా మరో సారి పత్తి చేనులో రైతుకు పులులు కనిపించడంతో రైతులు భయకంపితులు అవుతున్నారు. మరో వైపు పులుల పాదముద్రలు ట్రాకింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. .టైగర్ ఫియర్ ట్రాకింగ్ కొలిక్కి వస్తే ఎన్ని పులులు వున్నాయనేది అంచనాకు రావచ్చంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికే శివారులో కనిపించిననాలుగు పులులు,కొద్ది రోజుల వ్యవధిలో రెండో సారి కనిపించాయి నాలుగు పులులు. బెజ్సూర్ మండలం, మర్తడి,కుంటలు ,కుకుడ శివారు ప్రాంతాల్లో సంచరిస్తుంది పులి.

కొమురం భీం జిల్లాలో రాత్రిళ్ళు కనిపిస్తున్న పులులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఈ కొత్త పులి రాష్ట్ర సరిహద్దులు దాటిందని తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీ నుంచి జిల్లాలో హల్చల్ చేసింది ఈపులి. పంట పాలాలు, గ్రామాల్లో సంచరించిన పులి ఎద్దులు, బర్రెలు, మేకలు, ఆవులపై దాడి చేసింది. ఎట్టకేలకు ప్రాణహిత దాటి పొరుగు రాష్ట్రం లోకి వెళ్లింది పులి. పాద ముద్రలను బట్టిఈ మేరకు నిర్ధారించారు అటవీ శాఖ అధికారులు. దాదాపు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిందీ కొత్త పులి. బెజ్జూర్‌ మండలం ప్రాణహిత దాటి మహారాష్ట్ర వైపు వెళ్ళినట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు.

కొమరంభీం జిల్లాలోని బెజ్జూర్‌ మండలం నాగేపల్లి, కోయపల్లి శివారులో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా వుండాలని ప్రజలకు సూచించారు. తమ ప్రాంతంలో పులి తిరుగుతోందని భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బెజ్జూర్ మండలంలో రెండురోజుల క్రితం పులి సంచారం కలకలం రేపింది. కుకుడా గ్రామంలో కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దుపై పెద్దపులి దాడి చేసింది. దీంతో ఎద్దుకు గాయాలు కాగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్ధానికులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here