రూ.1360 కోట్లు కట్టినా.. కేంద్రం ఇలా చేయడం దారుణం

0
749

కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇవ్వకుండా పవర్ పర్చేస్ జరపకుండా ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. 20 మిలియన్ యూనిట్స్ ఇవాళ డ్రా చేయలేకుండా పోయాం. ఇలా ఎందుకు జరిగింది అనేది అర్థం కావడం లేదు. జనరేటర్, డిస్కంలకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఉంటుంది ఇది వారి ఒప్పందంతో అమ్ముకోవచ్చు. రూ.1360 కోట్లు మనం కట్టినప్పటికి ఇలా చేయడం చాలా బాధాకరం. మనం పేమెంట్ చేసిన ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. పవర్ ఎక్స్చేంజి పై ఇవాళ సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ప్రజలకు, వినియోగదారులకు సాధ్యమైనంత ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయండి సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో జల విద్యుత్ ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం.

థర్మల్, హైడల్, సోలార్ పవర్ చాలా బాగా ఉత్పత్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో 12214 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిన ఎక్కడ కూడా సరఫరాకు అంతరాయం రాకుండా సరఫరా చేశాము.రైతన్నలు, ప్రజలు వినియోగదారులు ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.హైకోర్టు స్టే ఉన్నప్పటికి ఇలా చేయడం బాధాకరం.బకాయిలు చెల్లింపు చేసినప్పటికీ ఇలా చేయడం విచారకరం.ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదన్నారు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.

రానున్న ఒకటి రెండు రోజుల్లో సరఫరా లో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు సహకటించాలని కోరుతున్నాం.ఇలా విద్యుత్ పర్చేస్ కాకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి,అంతేకాదు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలది ఎలాంటి తప్పులేదు.రాష్ట్రంలో జల విద్యుత్, థర్మల్, సోలార్ విద్యుత్ ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here