బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీఛ చరిత్ర ఈటెల ది

0
110

బీజేపీ లో ఈటెల రాజేందర్‌ ది బానిస బతుకు బతుకుతున్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రిగా చేసింది కేసీఆర్ యే అంటూ గుర్తు చేసారు. ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారంటూ మండిపడ్డారు. ఆరోగ్య మంత్రిగా.. ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారాడని విమర్శించారు. హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయమని స్పష్టం చేసారు. అందుకే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీఛ చరిత్ర ఈటెల ది అంటూ ఎద్దేవ చేసారు. ఈటెల చిట్టాను బయటకు తెస్తాం అంటూ సపథం చేసారు. కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని వ్యాఖ్యానించారు. ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. నోరు జాగ్రత్త అని హెచ్చరించారు.

read also: Rishi Sunak: యూకే ప్రధాని అభ్యర్థి రిషిసునక్ పై చైనా ఆగ్రహం

ఈటెల దమ్ముంటే మళ్ళీ హుజురాబాద్ లోనే పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఒడిపోతాననే తెలిసి ఈటెల కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. హుజురాబాద్ లో మొన్న ఈటెల.. కాంగ్రెస్, రేవంత్ ల సాయంతో గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈటెల ఎక్కువగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఆయన నాలుక చీరేస్తారని హెచ్చారించారు. 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటెల అంటున్నారు, కనీసం వార్డు మెంబర్ కూడా టచ్ లో లేరని బాల్కసుమన్‌ విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీఆర్ఎస్ లో చేరికలుంటాయని సంచలన వ్యాఖ్యలు చేసారు సుమన్‌. కేసీఆర్ గజ్వెల్ లో ఈసారి పోటీ చేయనని ఎవరికి చెప్పారు అంటూ ప్రశ్నించారు. గవర్నర్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిది హితువు పలికారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించే వారని, క్లౌడ్ బరస్ట్‌ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్ర వేత్తనా అంటూ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here