అమిత్ షా తెలంగాణ టూర్.. రిటర్న్ షెడ్యూల్ లో స్వల్ప మార్పు

0
128

ఆగస్టు 21న మునుగోడుకి అమిత్ షా రానున్న సందర్భంగా.. షెడ్యూల్‌ లో స్వల్ప మార్పును బీజేపీ శ్రేణులు ప్రకటించారు. ఆగస్టు 21న మునుగోడు భారీ బహిరంగ సభ అనంతరం ఆయన ఢిల్లీకి వెల్లే తిరుగు ప్రయాణంలో స్వల్ప మార్పులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. మునుగోడు లో బహిరంగ సభ ముగిశాక రోడ్డు మార్గంలో ఫిల్మ్ సిటీ కి వెళ్లనున్న అమిత్ షా 6.45 నుండి 7.30 వరకు ఫిల్మ్ సిటీ లో బస చేయనున్నారు. 8 గంటల నుండి 9.30 వరకు హోటల్ నోవెటల్‌ లో పార్టీ నేతలతో షా సమావేశం కానున్నారు రాత్రి భోజనం కూడా అక్కడే చేయనున్నారు. తిరిగి రాత్రి 9.30 కి తిరిగి డిల్లీ వెళ్లనున్నారు.

ఆగస్టు 21న మధ్యాహ్నం 1:20 నిమిషాలకు డిల్లీ నుండి బయలదేరనున్న అమిత్ షా.. మధ్యాహ్నం 3 :40 కి శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు. సాయంత్రం 4: 00 గంటలకు మునుగోడు కి బయలు దేరనున్నారు. సాయంత్రం 4.15 కి మునుగోడు కు చేరుకుని, 4:25 గంటల నుండి 4:40 వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బీజేపీ భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై ,ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నదానిపై షా వివరించనున్నారు. ఈసభ 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈసభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, అమిత్‌ షా సమక్షంలో కషాయి కండువా కప్పుకోనున్నారు. ఈ సభకు ఇది సెంట్రల్‌ అట్రాక్షన్‌ గా నిలువనుందని పార్టీవర్గాల్లో టాక్‌. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు అక్కడి నుండి బయలు దేరి శంషాబాద్ విమానాశ్రయానికి షా బయలుదేరి.. ఢిల్లీకి తిరిగి ప్రయాణం కానున్నారు అమిత్ షా.

ఈ నెల 21న మునుగోడు ఉప ఎన్నిక కోసం అమిత్ షా రంగంలోకి దిగడానికి ముందుగానే, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారనే చర్చతో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌ మునుగోడు ఉప ఎన్నికను ఎంతో సీరియస్‌గా తీసుకుంది. అక్కడ బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని చర్యలు చేపట్టింది. దీంతో అమిత్ షా సభ కంటే ముందుగానే మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పట్లు షురూ చేసింది. మునుగోడు సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అయితే.. ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here