స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దోమల్ గూడలోని భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ స్కూల్ లో వనమహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం అందరితో కాలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్‌ఎస్ కంచుకోట అని, ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. హుజూర్ నగర్, నాగార్జన సాగర్ లాగే మునుగోడులో టీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
readd also: Varavara Rao: సుప్రీం కోర్టులో ఊరట.. భీమా కోరేగావ్ కేసులో శాశ్వత బెయిల్
టీఆర్‌ఎస్ కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. ప్రజాసంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బ్యాక్ డోర్ పాలిటిక్స్ మానుకోవాలని కవిత హితువు పలికారు. దేశం కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవడానికి సీఎం కేసీఆర్ అద్భతమైన కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారని, తెలంగాణ రాక ముందు గ్రీనరీ 21 శాతం మాత్రమే ఉండేదని, ఇప్పుడు 31 శాతానికి పెరిగిందని గుర్తుచేశారు. ఇది 31 శాతానికికే కాదు ఇంకా 34 శాతానికి గ్రీనరీ పెరిగే వరకు తెలంగాణ ప్రజలు నిష్క్రమించవద్దని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, జైహింద్ అనాలని కవిత రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు.
Sudheer Babu: ఆ అమ్మాయి గురించి సుధీర్ బాబు చెప్పేది ఎప్పుడంటే….