నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గత నెల మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు మే 23న ముగిసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in వీటిలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అనంతరం ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. మీ.. హాల్ టికెట్ నెంబర్ ను టైప్ చేసి సెర్చ్ చేస్తే స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్ షీట్‌ను ప్రింట్ కూడా చేసుకున సదుపాయం కూడా కల్పించారు.
ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు ఫస్టియర్‌లో ఫస్టియర్‌లో 63.32 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడిట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 62శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరంలో 4,64,892 మంది విద్యార్థులు హాజరుకాగా.. ఇందులో 2,94,378 మంది పాసవగా 63.32శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్‌లో 4,14,380 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2,68,763 మంది పాసయ్యారు. కాగా.. 64శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక వొకేషనల్‌లో 50,512 మంది పరీక్షలు రాయగా.. 25,615 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 54.25శాతం ఉత్తీర్ణత నమోకాగా.. బాలికలు 72.33శాతం, బాలుర 54.25శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,42,895 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,97,458 మంది ఉత్తీర్ణత సాధించారు. 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 75.33శాతం బాలురు 59.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. చెప్పిన సమయం ప్రకారం.ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అయితే.. ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర‍్వహించనున్నారు.