తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టింది.. ప్రైవేట్ సంస్థల బాటలోనే టీఎస్‌ఆర్టీసీ నడుస్తూ ప్రజలను ఆకర్షించేలా డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తుంది.. ఈ తరహాలోనే పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం టి-9 టిక్కెట్లను మంజూరు చేస్తుంది..
దీనితో పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలకు మరియు వృద్దులకు వారు ప్రయాణించే దూరాన్ని బట్టి ఈ టికెట్ ధర ఉంటుంది.. 60 కిలో మీటర్ల పరిధిలో ప్రయాణికుని గమ్యస్థానం ఉంటె టి-9-60ని, 30 కిలో మీటర్ల పరిధిలో ఉంటె టి-9-౩౦ టికెట్ ని అమలులోకి తీసుకొచ్చింది.. దీని ప్రకారం టి-9-60 టికెట్ ధర రూ/ 100 ఉండగా టి-9-౩౦ టికెట్ రూ/ 50 కి ఇస్తుంది..
అయితే రాఖీపున్నమి సంధర్బాగా ఈ టిక్కెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది.. దీనికి కారణం ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం చేస్తారు కనుక రద్దీ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి (టీఎస్‌ఆర్టీసీ) సిబ్బందికి కష్టంగా ఉంటుంది.. ఎందుకంటే టికెట్స్ మంజూరు చేసేటప్పుడు ప్రాయానుకుని వయసుతో పాటు.. జెండర్ మరియు ఇతర వివరాలను నమోదు చెయ్యాలి.. అంత రద్దీలో ఇలా చేయడం కష్టం అందుకే రేపటి నుండి సెప్టెంబర్ 1 వరకు ఈ టి-9 టికెట్లని నిలిపివేస్తున్నామని తిరిగి సెప్టెంబర్ 2 నుండి యదావిధిగా ఈ టి-9 టిక్కెట్ల సేవ కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు