Breaking : ఈ నెలాఖరులోపు 10వ తరగతి ఫలితాలు

0
147

గత నెల మే 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్లుగా 20 రోజులలోనే పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. కానీ.. ఈ నెలాఖరు లోపు 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తయ్యింది. ఇప్పుడు.. పోస్ట్ వాల్యూయేషన్‌ ప్రాసెస్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు.. ఈ నెల 25 తర్వాతనే ఇంటర్ ఫలితాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.

ఒకటి రెండు పపేర్ లు మినహా మిగతా పేపర్‌ల వాల్యుయేషన్ పూర్తయింది. ఈ నెల 16తో పేపర్ కరెక్షన్ ముగియనుంది. పేపర్ కరెక్షన్ పూర్తయిన తర్వాత ఫలితాల విడుదలకు దాదాపు పది రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు. ఏ రోజు కా రోజు ఆయా పేపర్ లలో వచ్చిన మార్క్స్ ను అప్డేట్ చేస్తున్నారు అధికారులు. 20 లోపు ప్రకటించాలని టార్గెట్ పెట్టుకున్నా.. ఆ లోపు ప్రక్రియ పూర్తి కావడం కష్టమేనని అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here