తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

0
161

తెలంగాణలో టెట్ ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. ఈ ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి విడుదల చేశారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్‌‌సై‌ట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. కాగా.. తెలంగాణ టెట్‌ 2022ను గత నెల 12వ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్‌-1 పరీక్షను 3,18,444 (90.62 శాతం) రాయగా.. అందులో 32.68 క్వానిఫై అయ్యారు.. అంటే.. కేవలం 1,04,078 మంది మాత్రమే అర్హత సాధించారు.. ఇక, పేపర్‌-2 పరీక్షను 2,50,8970 (90.35 శాతం) మంది అభ్యర్థులు రాయగా.. 49.64 మంది క్యాలిఫైతో పరవాలేదనిపించారు.. పేపర్‌ 2ను 2,50,897 మంది రాయగా.. అందులో 1,24,535 మంది అర్హత పొందారు.. మొత్తంగా తెలంగాణ వరుసగా ఫలితాలు విడుదల చేస్తోంది విద్యాశాఖ.. మొన్న ఇంటర్, నిన్న టెన్త్‌ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇవాళ‌ టెట్ ఫలితాలను విడుదల చేసింది.

అయితే.. జూన్ 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్ 1.. పేపర్ 2 పరీక్షలు జరిగగా.. పేపర్-1కు 3 లక్షల 18 వేల 506 మంది, పేపర్-2కి 2 లక్షల 51 వేల 70 మంది హాజరుకాగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నేప‌థ్యంలో.. ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. కాగా.. పేపర్-1పై 7 వేల 930.. పేపర్-2పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. అయితే.. రెండు రోజుల క్రితం తుదికీ విడుదల చేయ‌గా.. తుది కీలో రెండు పేపర్లలో 13 ప్రశ్నలకు మార్పులు చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here