తెలంగాణలో మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలకు స్వరం సిద్దమైంది. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 17 ఆదివారం జరగనున్నాయి. లష్కర్ బోనాలకు సీఎం కేసీఆర్ సహా వీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో లష్కర్ బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉండడంతో మహంకాళి ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,500 మంది పోలీసులు, 280 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. బందోబస్తు ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, వీఐపీలు వచ్చే అవకాశాలు ఉండడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసేవరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ట్రాఫిక్ ను డైవర్షన్స్ చేశారు. ఆలయానికి 2 కి.మీ దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.