Adilabad: నిలిచిపోయిన భగీరథ నీటి సరఫరా.. త్రాగు నీరకై ఎదురు చూపుల్లో 872 గ్రామాలు

0
38

మనిషి ఆహారంలేకుండా కనీసం నెలైన బ్రతకగలడు.. కానీ నీరులేకపోతే వారం బ్రతకడం కూడ కష్టమే.. అందుకే నీరు అనేది చాల అవసరం.. నీరు సమృద్ధిగా ఉన్నవాళ్లలో కొంతమంది దాని విలువ తెలిసీ వృద్దా చేస్తుంటారు.. కానీ ఎంతోమంది ఆ నీరులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.. తాజాగా అలాంటి పరిస్థితిని తెలంగాణలో వందలాది గ్రామాలు ఎదుర్కొంటున్నాయి..

వివరాలలోకి వెళ్తే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది.. నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలం మాడేగాం ఫిల్టర్ బెడ్డు వద్ద హై హోల్టేజీ కారణంగా వైర్లు కాలిపోవడంతో రెండు జిల్లాల్లో నీటి సరఫరా ఆపేసారు… దీనితో ఆదిలాబాద్ జిల్లాలో 780 గ్రామాలకు మరియు నిర్మల్ జిల్లా 92 గ్రామాలకు నీటిసరఫరా నిలిచిపోయింది..

ఎస్ఆర్ ఎస్పీ నుంచి పైప్ లైన్ ద్వారా ఆదిలాబాద్ ,నిర్మల్ జిల్లాల్లాలకు నీటి సరఫరా అందిస్తున్నారు అధికారులు. మాడేగాం వద్ద నుంచి సరఫరా అవుతుంది నీరు.. కాగా కేబుల్ కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది .. దీనితో గత్యంతరం లేక ప్రజలు పాత బోర్లు పైన పాత ట్యాంక్ర్ల పైన ఆధారపడుతున్నారు..

కాగా త్రాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.. నీటి సరఫరా నిలిచిపోయి 3 రోజులు అవుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు.. అదేం అంటే మరమత్తులు చేస్తున్నాం అంటూ మాట దాటేస్తున్నారు అధికారులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.. ఇప్పటి కైనా అధికారులు స్పందించి త్వరగా మరమ్మత్తు పనులు చేయాలని కోరారు. సాయంత్రం లోపు నీటిని పునరుద్దరించాలని అధికారులకు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here