ఎస్‌ఐ పరీక్ష సరిగా రాయలేదని చెరువులో దూకిన యువతి

0
176

చిన్న చిన్న కారణాలతో కొందరు తమ విలువైన ప్రాణాలను తీసుకునే దుస్థికి వస్తున్నారు. అమ్మ తిట్టిందని, ప్రియురాలు కాదనిందని, ఫెయిల్‌ అయ్యామని, ఎగ్జామ్‌ బాగా రాయలేదని ఇలాంటి కారణాలు చెబుతూ మనస్తాపానికి గురై బలవత్మరానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం జంగంపల్లిలో చోటుచేసుకుంది.

read also: <a href=”https://ntvtelugu.com/top-story/kcr-to-go-bihar-telangana-cm-kcr-to-go-bihar-211995.html”>KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం.</a>

పంచశీల అనే యువతి డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉంటోంది. ఆగస్టు 7న తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు పంచశీల హాజరైంది. కానీ అప్పటి నుంచి తనకు ఏదో నిరాసనతో వుంటోంది. పరీక్ష సరిగా రాయలేదని, తనకు ఎస్సై జాబ్‌ రాదని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు కూడా ఉన్నారని కూడా గ్రహించలేదు ఆయువతి. హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు వెళ్తూ పంచశీల మార్గ మధ్యలో జంగంపల్లి గ్రామ చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది.

స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామం వాసురాలుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతురు మృతి వార్త విని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పంచశీల మృతితో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
<a href=”https://ntvtelugu.com/andhra-pradesh-news/ysrcp-mla-balineni-srinivasa-reddy-about-pawan-kalyan-and-janasena-party-211992.html”>Balineni Srinivasa Reddy: అది అంత వరకే..! పవన్‌ కల్యాణ్‌తో టచ్‌లో లేను..</a>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here