వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నోట ఓ మాస్ డైలాగ్ వచ్చింది.. అది విన్నవారంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వేశారు.. ఇంతకీ ఆమె వేసిన ఆ మాస్ డైలాగ్ ఏంటి? అనే అనుమానం వెంటనే మీకు రావొచ్చు.. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.. ఈ మధ్య గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న కేటీఆర్.. ఓటీటీలో బెస్ట్ మూవీపై సలహా ఇవ్వండి అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.. దీనికి సోషల్ మీడియా వేదికగానే కౌంటర్ ఎటాక్‌కు దిగారు షర్మిల.. అయితే, దానికి వచ్చిన రిఫ్లేలపై ఘాటుగా స్పందించారు.. రెస్ట్‌లో ఉన్నాను అంటూ కేటీర్ ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే మేం వెటకారంగా ట్వీట్ చేశాం.. దానికి చిన్న దొర గారికి కోపం వచ్చిందని.. మాపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని మండిపడ్డారు.. దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి.. అధికారం చేతుల్లో ఉంది, పాలన చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని షోలు, సినిమాలు చూస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు షర్మిల..
రాష్ట్రంలో ఓవైపు వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోరు.. మరోవైపు ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి చేశారు అని నిలదీసిన వైఎస్ షర్మిల.. ఇంట్లో నుంచి రిమోట్‌గా పని చేయలేరా? కరోనా సమయంలో మనమందరం పని చేయలేదా? ఇప్పుడు కేటీఆర్ అలా చేయవచ్చు కదా? అని మండిపడ్డారు.. వరదలొచ్చి ఒక పక్క రైతులు నష్టపోయారు, ఇండ్లు కోల్పోయారు. వాళ్లకు ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఓటీటీ సినిమాలు చూస్తారట అంటూ దుయ్యబట్టారు.. ప్రజలకు ఏం హామీలిచ్చి అదికారంలోకి వచ్చారు, ఏ హామీలు నెరవేర్చకుండా సిగ్గు లేకుండా ఒక స్త్రీపై పై వ్యక్తిగతం విమర్శలు చేస్తున్నారు అంటూ ఘాటుగా రియాక్ట్ అయిన షర్మిల.. మీకు ఎలా అర్థమైందో ఏమో గానీ.. నాకైతే మండిందపి మాస్ డైలాగ్ వేశారు వైఎస్ షర్మిల.