వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు.పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి వరద ధాటికి మునిగి పోయిన పంట పొలాలను రైతులతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. గోదావరి వరద ధాటికి 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు వివరించారు. కేసీఅర్ తానే ఇంజనీర్ గా, సైంటిస్ట్ గా, డాక్టర్ గా, అపర మేధావిగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు మునిగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఅర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని విమర్శించారు.
కాళేశ్వరంప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు. కానీ వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,పొలాల్లో ఇసుక మేటలు వేసిందన్నారు. దీనివల్ల ప్రయోజనం జరగకపోగా, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గేట్లు ఎత్తేముందు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.18 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన దేవాదుల ప్రాజెక్ట్ చెక్కు చెదరలేదని, కాళేశ్వరం ఎందుకు ఇలా అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికి లాభం అన్నారు. పరిస్థితిని పక్కదారి పట్టించేపనిలో ముఖ్యమంత్రి కేసీఅర్ మాట్లాడుతూ ఎప్పుడూ వరదలు రాలేదు అంటున్నారు.
మేఘ మథనం అంటున్నారని అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నాడని వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రాజెక్ట్ లు కట్టే ముందు వరదలు వస్తే ఎలా రక్షించుకోవాలని అని అంచనా వేస్తారు, కేసీఅర్ కు పరిపాలన చేత కాదని ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి లేనట్లేనని విమర్శించారు.YSR తెలంగాణ పార్టీ తరుఫున మంచిర్యాల పట్టణంలోని NTR నగర్ లో వరదలకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తాం అన్నారు వైఎస్ షర్మిల. పోడు రైతులకు పట్టాలిస్తానన్న కేసీఆర్.. ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వకపోగా, భూములు లాక్కుంటూ ఆదివాసీ గిరిజనుల పొట్ట కొడుతున్నాడు.