ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్లీనరీ పండుగకు సర్వం సిద్ధం అయింది. తొలిరోజు ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్కాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల10 నిమిషాలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించనున్నారు. 10:15 గంటల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధనలు జరగనున్నాయి. 10:30 గంటలకు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. తరువాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. ఉదయం 10:55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఈ ప్రకటనను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేయనున్నారు.
ప్లీనరీ వేదికకు వైయస్ఆర్ ప్రాంగణంగా నామకరణం
వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైయస్ఆర్ సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదికకు వైయస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేసినట్లు ప్లీనరీ కన్వీనర్ తలశీల రఘురామ్ తెలిపారు. ప్లీనరీ ప్రాంగణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు పాస్‌లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి వేడుకలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు సీఎం జగన్. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.అక్కడి నుంచి నేరుగా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానం వద్దకు చేరుకుని, ప్లీనరీలో పాల్గొంటారు.