ఏపీ, తెలంగాణను కలిపితే స్వాగతిస్తాం

0
671

మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ళ క్రితం జరిగిపోయిన ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై ఆయన మాట్లాడారు. విభజన చట్టం హామీల అమలు కోసం మేం పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు. ఒకవేళ ఏపీ, తెలంగాణ కలిసిపోయే పరిస్థితి వస్తే మోస్ట్ వెల్ కం అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే తప్పేం ఉంది? అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనే మేం కోరుకుంటాం అన్నారు. విభజన చట్టం ప్రకారం, హక్కుల సాధన కోసం మేం పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు.

గత ప్రభుత్వం ఏ విషయంలోనూ ప్రజలకు అండగా నిలవలేదని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయాడన్నారు. చంద్రబాబు మాటలు తప్ప చేతలు లేవన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ పాలనలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. అవినీతికి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ సాయం జమ చేస్తున్నామని చెప్పారు. బీసీ సభ సాక్షిగా ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ వివరించారన్నారు. జయహో బీసీ మహాసభ సక్సెస్‌ కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు. బీసీల సభ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

ఎవరి గురించి అయినా చులకన భావంతో మాట్లాడటం సరికాదని, చంద్రబాబు మైండ్‌సెట్‌ మార్చుకోవాలని సూచించారు. అమరావతి అక్రమాలలో ఏ డీఎన్‌ఏ ఉంది…? పేదల భూములు దోచుకోవడంలో ఏ డీఎన్‌ఏ ఉంది..? ఇప్పుడు బీసీలు టీడీపీ డీఎన్‌ఏ అని ఎలా అంటారు..? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగింది.. రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తాం. ఉమ్మడి రాష్ట్రంగా కలిసిపోవాలనుకుంటే మోస్ట్‌ వెల్‌కం.. అందుకు మేము ఎప్పుడైనా సిద్ధమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here