కేంద్ర ప్రభుత్వంపై కూనంనేని విసుర్లు

0
135

విభజన చట్టం ప్రకారం ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. హామీని గాలికొదిలేసారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కుంటి సాకులు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు చేయాలని బయ్యారం నుంచి హన్మకొండ వరకు ప్రజా పోరు యాత్ర చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ నెల 25నుండి వచ్చే నెల 5 వరకు ఈ యాత్ర చేస్తామని, ఏప్రిల్ 9న తెలంగాణ సీపీఎం, సీపీఐ ల మండల స్థాయి నాయకులతో సంయుక్త సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తామన్నారు.

Also Read : బాలికలతో అర్ధనగ్న నృత్యాలు వేయించి.. వీడియోలు తీసిన టీచర్ అరెస్ట్

ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల ఎజెండాను ఖరారు చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విద్యార్థులు భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని, దేశంలో పేపర్ లీకేజీ రుగ్మత గా తయారయిందన్నారు. భయం లేకే పేపర్ లీకేజీ జరుగుతుందని, కఠిన శిక్షలు ఉండాలన్నారు. పరీక్ష రద్దు సరైంది కాదని, 90 మార్కుల పైన వచ్చిన వారిని విచారణ చేయండన్నారు. ఇంత జరుగుతుంటే చైర్మన్ నిద్రపోతున్నాడా అని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వంకు బాధ్యత లేదా, జరిగిన దానికి నైతిక బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సీబీఐ, ఈడీ నరేంద్ర మోడీ అమ్ములపొదిలోని ఆయుధాలని ఆయన విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని, 9 ఏళ్ళలో ఒక బీజేపీ నేతపై కూడా సీబీఐ, ఈడీ కేసు నమోదు కాలేదన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ పై 30 ఏళ్ళు గా కక్ష్య సాధింపు జరుగుతూనే ఉందని, ఇప్పుడు వాళ్ల పిల్లలపై కూడా కేసు పెడుతున్నారన్నారు. బీజేపీలో చేరుతే కేసు మాఫీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కవిత, సిసోడియా బీజేపీ కి లొంగిపోతే ఏ కేసు లు ఉండవని, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసే అవినీతి తట్టుకోలేక.. బీజేపీ నేతలే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here