మళ్లీ చిక్కిన ఆ అరుదైన చేప.. ఇక సునామీయే..! వణికిపోతున్న జనం..

0
759

కొన్ని సెంటిమెంట్లు ప్రజలను భయపెడతాయి.. ఇది జరిగిందంటే.. అది కూడా జరుగుతుందేమోననే అనుమానాలకు తావిస్తాయి.. ఇప్పుడు మత్స్యకారులకి చిక్కిన చేపను చూసి ప్రజలు వణికిపోతున్నారు.. అందరినీలోనూ భయం నెలకొంది.. ఆ చేప కనిపించడమే అపశకునమని.. ఇది భారీ ప్రమాదాలకు సూచిక అంటూ హడలిపోతున్నారు ప్రజలు.. అయితే, ఈ వ్యవహారం సోషల్‌ మీడియాకు ఎక్కింది.. అది భయపెట్టే చేప అంటూనే.. షేర్లు, ట్వీట్లు, రీట్వీట్లతో వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు..చిలీలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చిక్కిన 16 అడుగుల పొడవున్న అరుదైన చేపకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మత్స్యారులకు చిక్కిన ఆ చేప 16 అడుగులు అంటే 5 మీటర్ల పొడవు ఉంది.. ఈ చేపను ‘ఓర్‌ఫిష్‌’గా పిలుస్తారట.. అది చూసి మత్స్యకారులు మురిసిపోయేలోపు.. ఇది కీడుకు సంకేతం అంటున్నారు ప్రజలు.. ఈ చేప కనిపించడం అపశకునమంటూ అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ఈ అరుదైన చేప కనిపిస్తే సునామీ, భూకంపాలు వస్తాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారట.. అయితే, ఇప్పుడు ఆ చేప మత్స్యకారులకు చిక్కడంతో.. ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని వణికిపోతున్నారు.. సాధారణంగా ఈ చేపలు సముద్ర గర్భం లోతుల్లో జీవిస్తాయట.. భూమి పొరల్లో కదలికలు వచ్చినపుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.. అంటే, ఈ చేప సముద్ర జలాల్లో పైకి వచ్చిందంటే సముద్ర గర్భంలో భారీ భూకంపాలు సంభవిచ్చినట్లు సంకేతం అంటున్నారు.. కానీ, దీనిని శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు.. ఓర్‌ ఫిష్‌ 11 మీటర్ల వరకు పొడవు ఉంటుందని చెబుతున్నారు.. సముద్రపు నీటి అడుగున జీవించే ఈ చేపలు.. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కూడా.. ఇలా పైకి వస్తాయని, బ్రీడింగ్‌ సమయంతోపాటు చనిపోయాక కూడా జలాలపైకి వస్తాయని నిపుణులు చెబుతున్నమాట.. ఇప్పుడు చిలీలో ఈ చేప చిక్కగా.. ఏప్రిల్‌ నెలలోనూ న్యూజిలాండ్‌లో ఓ ఓర్‌ ఫిష్‌ కనిపించిందట.. మొత్తంగా ఓర్‌ ఫిష్ ఎంతోమందిని భయపెడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here