దేశంలో ఎక్కడ చూసినా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పక్కనోడు సంపాదించిన సొమ్ము మీదే దొంగల కళ్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో జరిగిన చోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వస్తుండగా రామోజీరావు అనే వ్యక్తి వద్ద కొందరు దుండగులు రూ.30 లక్షలు కొట్టేశారు. ఆర్టీసీ బస్సు నార్కెట్‌పల్లి చేరుకున్నాక బ్యాగ్‌లో చూస్తే డబ్బులు లేకపోవడంతో బాధితుడు రామోజీరావు పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో తన యజమాని ఒక సైట్‌కు అడ్వాన్స్ ఇవ్వడానికి రూ.30 లక్షలు తనకు ఇచ్చారని.. అందుకే విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వెళ్తున్నానని బాధితుడు హయత్‌నగర్ పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్కట్‌పల్లికి కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే డబ్బు నార్కట్‌పల్లిలో పోతే హయత్‌నగర్ వచ్చి ఫిర్యాదు చేయడమేంటని పోలీసులు రామోజీరావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది.