మీకు తెలుసా..? ఈ క్రెడిట్ కార్డు ఉంటే 68 లీటర్ల పెట్రోల్ ఫ్రీ..!

0
8846

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.. వరుసగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్‌ ధరలను అదుపుచేసేందుకు కేంద్ర సర్కార్‌ వ్యాట్‌ తగ్గించినా.. ఇప్పటికీ లీటర్‌ పెట్రోల్ రూ.110 దగ్గర.. లీటర్‌ డీజిల్‌ రూ.100కు చేరువగానే ఉంది.. అయితే, గత కొద్ది రోజులుగా మాత్రం పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ చోటు చేసుకోవడం లేదు.. ఇక, మరికొన్ని రాష్ట్రాల్లో.. మరింత తక్కువకే చమురు లభిస్తోంది.. సామాన్యులు బండి, కారు బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఈ సమయంలో.. సిటీ బ్యాంక్‌ ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది.. ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డుపై ఏడాదికి ఏకంగా 68 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా అందిస్తామని చెబుతోంది.. అయితే, ఈ క్రెడిట్ కార్డు ఉంటే సరాసరి వెళ్లిపోయి ఫ్రీగా 68 లీటర్ల చమురు పొందవచ్చు అనుకుంటున్నారేమో..? కానీ, దీనికి కూడా కొన్ని షరతులు వర్తిస్థాయి..

ఇక, అసలు విషయానికి వస్తే.. ఇండియన్ ఆయిల్‌తో సిటీ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది.. ఇండియన్ ఆయిల్ సిటీ పేరుతో క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది.. దీనినే ఫ్యూయల్ క్రెడిట్ కార్డు అని కూడా పిలుస్తారు.. అయితే, ఈ క్రెడిట్ కార్డుతో 68 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌ ఎలా పొందవచ్చు అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ క్రెడిట్ కార్డుతో జరిపే లావాదేవీల ద్వారా వచ్చే రివార్డ్స్, టర్బో పాయింట్లు.. 68 లీటర్ల పెట్రోల్ ధరకు సమానమని చెబుతోంది సిటీ బ్యాంక్.. అంటే, ఉదాహరణకు ఈ కార్డుపై ఇండియన్ ఆయిల్ పెట్రో బంక్‌ల్లో రూ.150తో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తే 4 టర్బో పాయింట్స్ లభిస్తాయి.. ఇక గ్రాసరీ స్టోర్స్‌లో, సూపర్ మార్కెట్లలో రూ.150పై చేసే లావాదేవీలపై 2 టర్బో పాయింట్స్ పొందవచ్చు.. ఇలా పొందిన టర్బో పాయింట్లతో పెట్రోల్‌ లేదా డీజిల్‌ కొట్టించుకోవచ్చు.. అంటే.. ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయితో సమానం.. కావును.. ఆ పాయింట్లపైనే ఫ్యూయల్‌ పొందవచ్చు.. మరోవైపు, ఇండియన్ ఆయిల్ పంపుల్లో ఒక శాతం ఇంధన సర్ ఛార్జీ మినహాయింపు కూడా పొందవచ్చు అని చెబుతోంది సిటీ బ్యాంక్.. ఇలా ఒక్క ఏడాదిలో వచ్చే రివార్డులు, టర్బో పాయింట్లతో 68 లీటర్ల వరకు చమురు పొందే అవకాశం ఉందని చెబుతోంది సిటీ బ్యాంక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here