ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో..! లేటు వయసులో రూ.5 కోట్ల లాటరీ..

0
314

ఓ వృద్ధుడికి జాక్‌పట్‌ తగిలింది.. ఏకంగా 5 కోట్ల రూపాయల లాటరీ తగిలింది.. పంజాబ్‌లో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిన 88 ఏళ్ల వృద్ధుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డేరా బస్సీలో నివాసముండే 88 ఏళ్ల వృద్ధుడు మహంత్ ద్వారకా దాస్… 1947లో 13 ఏళ్ల వయసులో పాకిస్థాన్ నుంచి వచ్చి పంజాబ్‌లో స్థిరపడ్డాడు. అయితే, సాధారణ కూలీ పనులు చేసి జీవనం సాగిస్తూ వచ్చాడు.. కానీ, లాటరీలు అంటే ఆయనకు పిచ్చి.. గత 40 ఏళ్లుగా తరచూ లాటరీలు కొనుగోలు చేస్తూ వస్తున్నాడు.. ఎప్పుడూ నిరాశే ఎదురైంది.. ఇనాళ్లకు అదృష్టం వరించింది…

ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఓ ల్యాటరీ కొనుగులు చేశాడు. కచ్చితంగా కొన్ని అంకెలు ఉండే లాటరీ నంబర్ కావాలని చెప్పి తన మనవడితో దీన్ని కొనుగోలు చేయించాడు మహంత్‌ ద్వారకా దాస్… కొద్ది రోజుల తర్వాత అదే నంబర్‌కు లాటరీ తలిగింది. దీంతో మహంత్ కుటుంబసభ్యుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అతనిని అభినందించడానికి మరియు పూలమాలలు వేయడానికి ప్రజలు అతని ఇంటికి రావడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం కనిపించింది.. ఈ లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకోగా.. ట్యాక్స్ పోను అతనికి రూ.3.5 కోట్లు అందుకోబోతున్నాడు.. ఇందులో సగం తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచుతానని, మిగతా సగం డేరాకు విరాళంగా ఇస్తానని చెప్పుకొచ్చాడు మహంత్.. ఇన్నాళ్లకు లాటరీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు..

ఇక, అతని కుమారుడు నరేందర్ కుమార్ శర్మ మాట్లాడుతూ, మా మేనల్లుడికి లాటరీ టిక్కెట్ కొనడానికి మా నాన్న డబ్బు ఇచ్చాడు, అతను దానిని గెలుచుకున్నాడు మరియు మేము సంతోషంగా ఉన్నాం అన్నాడు.. జిరాక్‌పూర్‌లో లాటరీ వ్యాపారం చేస్తూ, ఆ టిక్కెట్‌ను కుటుంబానికి విక్రయించిన లోకేష్, పన్నులు మినహాయించిన తర్వాత ద్వారకా దాస్‌కు సుమారు రూ. 3.5 కోట్లు వస్తాయని పేర్కొన్నాడు. పంజాబ్ స్టేట్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్ లాటరీ 2023 ఫలితాలు జనవరి 16న ప్రకటించబడ్డాయి. అందులో ద్వారకా దాస్ రూ.5 కోట్ల మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. 30 శాతం పన్ను మినహాయించిన తర్వాత మిగతా మొత్తం అతనికి ఇవ్వనున్నట్టు అసిస్టెంట్ లాటరీ డైరెక్టర్ కరమ్ సింగ్ తెలిపారు. మరోవైపు.. డిసెంబర్‌లో, ఎమిరేట్స్ డ్రాలో దుబాయ్‌లో డ్రైవింగ్‌ చేస్తున్న భారత్‌కు చెందిన డ్రైవర్ అజయ్ ఒగులా 15 మిలియన్ దిర్హామ్ (రూ. 33 కోట్లు) విలువైన బహుమతిని గెలుచుకున్నాడట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here